Sat Mar 07 2026 20:27:05 GMT+0530 (India Standard Time)
ఎంపీలకు రఘురామ కృష్ణరాజు లేఖ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పార్లమెంటు సభ్యులందరికీ లేఖ రాశారు.

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పార్లమెంటు సభ్యులందరికీ లేఖ రాశారు. తనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎష్ జనగ్ అధికార దుర్వినియోగం చేసి తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన లేఖలో తెలిపారు.
అక్రమ కేసులు...
తనపై గతంలో ఏపీ ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టిందన్నారు. సీబీసీఐడీ అధికారులతో తనను వేధింపులకు గురిచేశారని రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. తన నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని, తాను ఫిర్యాదు చేస్తే తిరిగి తనపైనే కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు.
Next Story

