Sun Dec 14 2025 01:52:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆ కంపెనీలు విజయసాయి బినామీలవే
అదాన్ డిస్టలరీ కంపెనీలలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బినామీలు ఉన్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు

అదాన్ డిస్టలరీ కంపెనీలలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బినామీలు ఉన్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. అదాన్ డిస్టలరీ డిస్టలరీ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి 40 నుంచి 42 శాతం చీప్ లిక్కర్ సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. ఏ ప్రాతిపదికన ఆ కంపెనీ నుంచి దానిని కొనుగోలు చేస్తున్నారని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. 19 డిస్టలరీ కంపెనీలకు చంద్రబాబు అనుమతి ఇచ్చారని చెబుతున్నారని, ఆ కంపెనీలను ప్రస్తుతం ఎవరు నిర్వహిస్తున్నారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ1 ఉన్నాడంటే ఏ2 కూడా ఈ కంపెనీలో వాటాదారుగా ఉంటాడని ఆయన అన్నారు. తనకు సంబంధం లేదంటే కుదరదని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
సోరెన్ బాటలోనే...
హేమంత్ సోరెన్ బాటలోనే తమ పార్టీ నేతలకు కూడా పయనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు కాంట్రాక్టు పనులు చేపడితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హులవుతారని అని రఘురామ కృష్ణరాజు అన్నారు. రాజ్యాంగం అంటే జగన్ కు గౌరవం లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం మాతృభాషను చంపేస్తుందన్నారు. ఉన్న టీచర్లు ఒక్కసారిగా ఇంగ్లీషులో బోధించడానికి వారు పండితులు అవుతారా? అని ప్రశ్నించారు. నోటిఫికేషన్లు కూడా తెలుగులో ఇవ్వడం లేదన్నారు. తెలుగు భాషా దినోత్సవం రోజున తలదించుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.
Next Story

