Mon Mar 16 2026 17:06:10 GMT+0530 (India Standard Time)
ఎంపీ న్యూడ్ వీడియో పై రఘురామ ఏమన్నారంటే?
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు, గోరంట్ల మాధవ్ చూపించిన వీడియోకు పొంతన లేకుండా ఉందని, దీనిని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని రఘురామ కృష్ణరాజు కోరారు. అప్పుడే అసలు విషయం బయటపడుతుందని తెలిపారు.
మరో రాష్ట్రానికి...
ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే వారికి అనుకూలంగా వచ్చే అవకాశముందని రఘురామ కృష్ణరాజు అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కూడా ఈ ఘటనపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయిందని ఆయన అన్నారు. తనన కూడా గోరంట్ల మాధవ్ పార్లమెంటు సాక్షిగా బెదిరించారన్న విషయాన్ని రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. ఇలాంటి వాటిపై స్పందించాలటే తాడేపల్లి నుంచి కీ స్పందించాలని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story

