Sun Mar 15 2026 19:58:49 GMT+0530 (India Standard Time)
ఉండి నుంచి నేనే పోటీ చేస్తున్నా : రఘురామ కృష్ణరాజు
ఉండి శాసనసభ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు.

ఉండి శాసనసభ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉండి నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో తాను బరిలో ఉండనున్నట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన తాను నామినేషన్ వేస్తున్నట్లు ఆయన చెప్పారు.
22న నామినేషన్...
ఉండి నియోజకవర్గం టిక్కెట్ రామరాజుకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ కేటాయించింది. అయితే రఘురామ కృష్ణరాజుకు నరసాపురం ఎంపీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయనకు అనివార్య పరిస్థితుల్లో ఉండి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. రామరాజుతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపి చివరకు రఘురామ కృష్ణరాజు పేరును ఫైనల్ చేసినట్లు ఆయన తెలిపారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కలుపుకుని వెళతానని రఘురామ కృష్ణరాజు మీడియాకు తెలిపారు.
Next Story

