Tue Feb 03 2026 22:00:26 GMT+0000 (Coordinated Universal Time)
నారా రామ్మూర్తినాయుడు కన్నుమూత
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. రామ్మూర్తినాయుడు వయసు 72 సంవత్సరాలు.
రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించిందని తెలియగానే నారా లోకేశ్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు.
దగ్గుబాటి పురందేశ్వరితో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. 1994లో టీడీపీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తినాయుడు గెలుపొందారు. ఆయనకు భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్, గిరీశ్ ఉన్నారు. రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story

