Thu Jan 29 2026 04:28:48 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నేడు నంద్యాలకు నారా లోకేష్
నేడు నంద్యాలలో నారా లోకేష్ యువగళం సభ జరగనుంది

నేడు నంద్యాలలో నారా లోకేష్ యువగళం సభ జరగనుంది. నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ వెనుక ప్రాంగణంలో యువగళం సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం పేరుతో నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో యువత పాత్రపై యువనేత నారా లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4నుంచి 6గంటల వరకు యువగళం సభ జరగనుంది.
యువగళం సభలతో...
జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున యువగళం సభకుయువత, విద్యార్థులు తరలి రానున్నారు. నంద్యాల సభ అనంతరం నేటి రాత్రి రాజంపేట బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యువగళం సభలకు యువతీయువకుల్లో అపూర్వస్పందన వస్తుందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటివరకు ఒంగోలు, నెల్లూరు, చంద్రగిరి పట్టణాల్లో యువగళం సభలు పూర్తయ్యా.యి. రేపు రాజంపేట, 5న ఏలూరు, 6న విజయనగరం, 7న శ్రీకాకుళంలో యువగళం సభలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

