Sun Mar 15 2026 07:39:29 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : లోకేష్ పాదయాత్ర ప్రారంభం
యువగళం పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం అయింది. రాజోలు నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్రను నారా లోకేష్ ప్రారంభించారు.

యువగళం పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం అయింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్రను నారా లోకేష్ ప్రారంభించారు. దాదాపు రెండున్నర నెల తర్వాత లోకేష్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో గత సెప్టంబరు 8వ తేదీన చంద్రబాబు అరెస్ట్ కావడంతో పాదయాత్రను లోకేష్ రాజోలు నియోజకవర్గంలో తాత్కాలికంగా నిలిపివేశారు.
బెయిల్ మంజూరుతో...
అయితే చంద్రబాబుకు ఆ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఆయన తిరిగి పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు నిన్న రాత్రి రాజమండ్రి చేరుకున్న లోకేష్ కు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. ఉదయం 10.19 గంటలకు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. రోజుకు పదిహేను కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
Next Story

