Thu Mar 19 2026 01:27:47 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : ఉత్తరాంధ్రలో లోకేష్ శంఖారావం
ఈ నెల 11వ తేదీ నుంచి నారా లోకేష్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. శంఖారావం పేరుతో ఆయన పర్యటన సాగనుంది.

ఈ నెల 11వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. శంఖారావం పేరుతో ఆయన పర్యటన సాగనుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి ఈ యాత్ర చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న ఎన్నికలకు పార్టీని క్యాడర్ ను కూడా సమాయత్తం చేస్తున్నారు.
రోజుకు మూడు నియోజకవర్గాల్లో...
ఇందులో భాగంగా నేతలతో కూడా కలసి లోకేష్ మాట్లాడనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖరారయిన నేపథ్యంలో ఆయన ఉత్తరాంధ్ర పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమయ్యే లోకేష్ యాత్ర రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పదకొండు రోజుల పాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేశారు.
Next Story

