Thu Dec 18 2025 10:04:13 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నారా లోకేశ్ ట్వీట్ ఇదే.. చంద్రబాబు కు అవార్డు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ విషయాన్ని రివీల్ చేస్తానని ఉదయం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో తీసుకు వచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలకు గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించిందని చెప్పారు. ఆ ప్రతిష్టాత్మకమైన అవార్డు గురించి తెలియజేశారు.
ట్వీట్ లో ఏమన్నారంటే?
నారా లోకేశ్ ఏం ట్వీట్ చేశారంటే..."మన కుటుంబానికే కాదు… ఆంధ్రప్రదేశ్‌కు కూడా గర్వకారణమైన ఘట్టం ఇది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎకనామిక్ టైమ్స్ ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుతో సత్కరించింది. సంస్కరణల ప్రయాణంలో స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో దేశాన్ని ముందుకు నడిపించిన నాయకులు చాలా కొద్దిమంది మాత్రమే. పాలనలో సంస్కరణలు, వేగం, నమ్మకంపై ఆయన చూపిన అచంచల దృష్టికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది" అని లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
Next Story

