Mon Dec 08 2025 01:08:52 GMT+0000 (Coordinated Universal Time)
దళితులపై వైసీపీ నేతల దమనకాండ : పెట్రోల్ బంక్ లో వైసీపీ నేత దారుణం
తమది దళితులకు అండగా నిలిచే ప్రభుత్వమని చెప్పుకుంటోన్న అధికార పార్టీ నేతలు.. ఎక్కడికక్కడే దళితులపై విషం కక్కుతున్నారని..

దళితులపై వైసిపి నేతల దమనకాండ కొనసాగుతూనే ఉందని టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. తమది దళితులకు అండగా నిలిచే ప్రభుత్వమని చెప్పుకుంటోన్న అధికార పార్టీ నేతలు.. ఎక్కడికక్కడే దళితులపై విషం కక్కుతున్నారని వాపోయారు. బొడిగుడిపాడు వైసిపి ఎంపీటీసీ మహేష్ నాయుడు.. కావలి నియోజకవర్గం, దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పెట్రోల్ బంక్ లో సర్వర్ పనిచేయని కారణంగా పెట్రోల్ కొట్టడం కుదరదు అన్నందుకు దళిత యువకుడు తేజపై అత్యంత దారుణంగా తన అనుచరులతో కలిసి దాడి చేశారని పేర్కొంటూ.. ఓ వీడియోను ట్వీట్ చేశారు.
"కాళ్ళతో తన్ని, ఇనుప రాడ్డుతో తేజని తీవ్రంగా గాయపరిచారు. దళిత యువకుడుపై దాడి చేసిన ఎంపీటీసీ మహేష్ నాయుడు, అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. గాయపడిన తేజకి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి." అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
Next Story

