Nara Lokesh : కడప మాస్ జాతర అదిరింది.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే
వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. కడప మహానాడులో లోకేశ్ మాట్లాడారు

వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. కడప మహానాడులో లోకేశ్ మాట్లాడారు. దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశారు, ఒక్క కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయన్నారు. అంతులేని ధనదాహంతో విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని ఏరులై పారించి ముప్ఫయి వేలమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారన్నారు. వేలకోట్లు దోచుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్లిపోయారని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదని, ప్రతిపక్షం కొత్త కాదు. కానీ 2019 నుండి 2024 వరకూ విధ్వంస పాలన ఎదుర్కొన్నామని, ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే అరెస్ట్. మన అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారన్నారు. నాయకులు, కార్యకర్తల పై వేల కేసులు, అరెస్టులు జరిగాయి. నాయకులు, కార్యకర్తల పై దాడులు చేశారన్న లోకేశ్ హత్యలు చేశారన్నారు.

