Mon Jan 20 2025 15:42:23 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : మనదే గెలుపు.. లోకేష్ ధీమా
అయిదేళ్ల అరాచకపాలనలో నరకం చూసిన ప్రజలు టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు
అయిదేళ్ల అరాచకపాలనలో నరకం చూసిన ప్రజలు టీడీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజాతీర్పు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉందని, జగన్ ఎన్నికుట్రలు పన్నినా విజయాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైనవని, వైసీపీ నాయకులు కావాలని గొడవలు సృష్టిస్తారని, ప్రజలు ఓపికతో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
గంజాయి కుటీర పరిశ్రమలా...
వైసీపీ పాలనలో గంజాయి పంటను కుటీర పరిశ్రమలా మార్చేశారన్న లోకేష్ తాను ప్రచారం కోసం కోయంబత్తూరు వెళ్తే అక్కడ కూడా ఏపీ నుండి గంజాయి సరఫరా అవుతోందని చెప్పారన్నారు. అప్పులు చేసి బటన్ నొక్కుతూ ఆ భారాన్ని పన్నులరూపంలో ప్రజలపై వేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కియా, టిసిఎల్, హెచ్ సిఎల్ వంటి పరిశ్రమలు రప్పించడంతో లక్షలాది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని, జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు.
Next Story