Sat Mar 07 2026 20:08:55 GMT+0530 (India Standard Time)
ఢిల్లీ నుండి రాజమండ్రికి నారా లోకేశ్
టీడీపీ నేత, చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ఢిల్లీ నుంచి

టీడీపీ నేత, చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన విజయవాడకు వచ్చారు. ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి లోకేశ్ నేరుగా రాజమండ్రికి బయల్దేరారు. రాజమండ్రిలోని క్యాంప్ ఆఫీసులో టీడీపీ కీలక నేతలతో లోకేశ్ భేటీ అవనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. తన తండ్రి ఆరోగ్యం నేపథ్యంలోనే లోకేశ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చినట్టు తెలుస్తోంది. 73 ఏళ్ల చంద్రబాబుని అనారోగ్య కారణాలతో అంతమొందించే కుట్ర జరుగుతోందని నారా లోకేష్ ఆరోపించారు. భద్రతలేని జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారన్నారు. ఎన్నడూ ఏ తప్పూ చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల రాక్షసంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని లోకేష్ అన్నారు.
Next Story

