Nara Lokesh : నారా లోకేశ్ కు కూటమి ముద్ర వేసినట్లుందిగా.. పాజిటివ్ గానే వెళుతున్నారుగా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేశ్ ఒకరకంగా భావి నేతగా అవతరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేశ్ ఒకరకంగా భావి నేతగా అవతరిస్తున్నారు. నారా లోకేశ్ విభిన్నశైలిని చూసిన వారికి ఎవరికైనా త్వరలోనే ఆయన కీలక పదవి అధిష్టించే అవకాశముందని అంచనా వేస్తారు. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు సమస్యలను ఎత్తి చూపేవారిని శత్రువులుగా చూస్తారు. వైసీపీ హాయంలో సమస్యలు చెప్పిన వాళ్లపై టీడీపీ ముద్ర వేసి వేధించారు. కానీ ఇక్కడ నారా లోకేశ్ మార్పు చూపిస్తున్నారు. సమస్యలను ప్రస్తావించడాన్ని ఓ సానుకూల విషయంగా చూసి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కోణంలో మన్యంలో సమస్యలపై జాతీయ మీడియా కథనాలు వచ్చినా.. గుంటూరులో డ్రైనేజీ సమస్య గురించి ఓ మహిళ చెప్పినా… ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిసినా.. మధ్యాహ్నభోజనం అంశంపై ఓ వీడియోలో విద్యార్థుల ఆగ్రహం గురించి తెలిసినా..ఆయన చాలా పాజిటివ్ గా స్పందించారు. సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు.

