Thu Mar 19 2026 06:26:10 GMT+0530 (India Standard Time)
లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇస్తారా?
నారా లోకేష్ పాదయాత్రకు డీజీపి నుంచి ఇంత వరకూ అనుమతి లభించలేదు

సుప్రీంకోర్టు విచారణ నేడు జీవో నెంబరు 1 పై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా వచ్చే తీర్పును ఆధారపడి లోకేష్ పాదయాత్రకు అనుమతి లభించే అవకాశముందని తెలిసింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27వ తేదీ నుంచి యువగళం పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే దీనిపై పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీని అనుమతి కోరుతూ లేఖ రాశారు.
ఇంత వరకూ...
అయినా ఇంత వరకూ డీజీపీ నుంచి అనుమతి లభించలేదు. కుప్పం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కోసం చిత్తూరు జిల్లా ఎస్పీకి కూడా ఈ నెల 12న టీడీపీ లేఖ రాసింది. కానీ ఇంతవరకూ అనుమతిస్తున్నట్లు, ఇవ్వ నిరాకరించినట్లు ఎలాంటి సమాచారం టీడీపీ కార్యాలయానికి అందలేదు. అయితే యువగళం పాదయాత్ర మాత్రం జరిగి తీరుతుంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Next Story

