Thu Apr 02 2026 11:00:13 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : నేడు ప్రధానిని కలవనున్న లోకేశ్
ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని మంత్రి నారా లోకేశ్ కలవనున్నారు

ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని మంత్రి నారా లోకేశ్ కలవనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ప్రధానిని కలిసి ధన్యవాదాలు తెలుపనున్నారు. ఈరోజు ఉదయం 10.30 గం.కు లోకేశ్ ప్రధానిని కలవనున్నారు. ప్రధానిని కలసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని లోకేశ్ కోరనరున్నారు.
రాజ్యసభలో...
అనంతరం అమరావతి చట్టబద్ధత బిల్లుపై మధ్యాహ్నం రాజ్యసభలో చర్చ ఉంటుంది. బిల్లు రాజ్యసభలో పెట్టే సమయంలో మంత్రి లోకేశ్ హాజరుకానున్నారు. నిన్న ఢిల్లీకి వచ్చిన లోకేశ్ నేడు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముందని తెలిసింది. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై చర్చించనున్నారు.
Next Story

