Tue Mar 10 2026 14:20:31 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. అక్కడ రేపు జరగనున్న వాట్సప్ సిటిజన్ ఎంగేజ్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం ప్రారంభోత్స కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్ గవర్నెన్స్ ప్రభుత్వ సేవలలో సాంకేతికను వినియోగించుకోవడం ద్వారా పాలనలో పారదర్శకతను పెంపొందిందడంపై చర్చించనున్నారు.
రేపు రాత్రికి విశాఖకు...
జవాబుదారీతనాన్ని ఎలా పెంచవచ్చన్న అంశంపై ఈ సదస్సులో కీలక చర్చలు జరగనున్నాయి. సదస్సు ముగిసిన అనంతరం రేపు రాత్రికి మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నానికి చేరుకుంటారు. విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో నారా లోకేశ్ పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు.
Next Story

