Fri Jan 17 2025 08:03:35 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు నారా లోకేష్ లేఖ
ఆక్వారంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.
ఆక్వారంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఆక్వా రంగం పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటందున్నారు. విద్యుత్తు ఛార్జీల పెంపుదలతో పాటు, రొయ్యల దాణా ధర పెరగడం, రొయ్యల ధర తగ్గడం వంటివి కారణంగా ఈ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని లోకేష్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆక్వా హాలిడే....
నాడు పాదయాత్రలో ఆక్వా రంగానికి, రైతులకు జగన్ హామీలు గుప్పించారని, ఆ హామీలను అమలుపర్చాలని లోకేష్ కోరారు. ఆక్వా రైతులకు యూనిట్ కు రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరవ్ాత మాత్రం పెంచారని లోకేష్ తప్పుపట్టారు. ఆక్వా రైతులకు రాయితీలను ఎత్తేయడం దారుణమన్నారు. అన్ని రంగాలు హాలిడే ప్రకటిస్తున్నాయని, పరిశ్రమలు, వ్యవసాయంతో పాటు ఆక్వా రైతులు కూడా క్రాప్ హాలిడేను ప్రకటిస్తారని, అలా చేయకుండా చర్యలు తీసుకోవాలని లోకేష్ లేఖలో సూచించారు.
Next Story