Tue Feb 24 2026 15:50:31 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్
Nara Lokesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై శాసనమండలిలో సభ్యుడు ఏ.శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగిందన్నారు. మొత్తం 9 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బోధన సిబ్బంది, 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది పోస్టులను మంజూరు చేయడం జరిగిందని, తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో డేటా లే దని నారా లోకేశ్ తెలిపారకు. ఏ టీచర్ ఎక్కడ పనిచేస్తున్నారో కూడా సమాచారం లేదు.
సమాచారం లేదని...
ఈ సమాచారాన్ని సేకరించడానికి తనకు 20 నెలల సమయం పట్టిందని, గతంలో నేను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేదని, వైసీపీ హయాంలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేశారని నారా లోకేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాల మంజూరు చేసినా, జూనియర్ కాలేజీ మంజూరు చేసినా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో ముందుకు వెళ్తున్నామని, ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని, ఇందుకు అవసరమైన అధ్యాపకులను నియమించాల్సిన అవసరం ఉంది. ల్యాబ్ లు కూడా ఏర్పాటుచేస్తాం. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ అందజేయాల్సిన అవసరం ఉందని నారా లోకేశ్ చెప్పారు. ఇంటర్ విద్యలో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించామని, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నామని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
Next Story

