Tue Jan 20 2026 21:12:02 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ మోసపు రెడ్డి.. లోకేష్ ఫైర్
ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బు మాయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బు మాయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు మాయంపై ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకంగా లేవన్నారు. వినేవాళ్లు ఆంధ్రప్రదేశ్ జనమైతే.. చెప్పేవాడు జగన్ మోసపు రెడ్డి అంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సీపీఎస్ రద్దు...
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవగాహన లేకనే సీపీఎస్ రద్దు హామీ ఇచ్చామన్నారు. ఇప్పుడు జీపీఎఫ్ లో ఉద్యోగుల డబ్బులు మాయం చేసి సాఫ్ట్ వేర్ సమస్య గా చిత్రీకరిస్తున్నారని లోకేష్ మండి పడ్డారు. నిధుల లేక చివరకు సచివాలయం సిబ్బంది వసతి సదుపాయాన్ని కూడా రద్దు చేస్తామని చెబుతున్నారన్నారు. త్వరలో శనివారం కూడా సెలవు రద్దు చేసి ఉద్యోగుల ఆరోగ్యభద్రత కోసమేనని చెబుతారని లోకేష్ ఫైర్ అయ్యారు.
Next Story

