Thu Feb 12 2026 14:56:00 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : విశాఖ భూ కేటాయింపులపై మండలిలో దుమారం
విశాఖపట్నంలో భూముల కేటాయింపులపై శాసనమండలిలో నారా లోకేశ్ సమాధానమిచ్చారు

విశాఖపట్నంలో భూముల కేటాయింపులపై శాసనమండలిలో నారా లోకేశ్ సమాధానమిచ్చారు. 99 పైసలకే భూమిని ఎలా ఇస్తారని వైసీపీ నేతలు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తాము పారదర్శకంగా భూముల కేటాయింపులు చేశామని తెలిపారు. పేరున్న కంపెనీలకు మాత్రమే తాము భూములను ఇచ్చామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు.
నిరూపిస్తే రాజీనామా చేస్తా...
టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకు భూములు తక్కువ ధరకు ఇచ్చామని, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. విశాఖపట్నంలో ఎక్కువ భూములు కేటాయిస్తున్నది ఉద్యోగాల కల్పన కోసమేనని నారా లోకేశ్ అన్నారు. 22 క్లస్టర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉర్సా కంపెనీకి 99 పైసలకే భూములు ఇచ్చామని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని లోకేశ్ ప్రకటించారు. అయితే విశాఖలో భూ పందేరానికి నిరసనగా శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది.
Next Story

