Sat Dec 13 2025 22:33:04 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : లోకేశ్ నిర్దాక్షిణ్యంగా ఆ నేతలను పక్కన పెట్టేస్తున్నారా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఒక విషయంలో మాత్రం క్లారిటీ ఉంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఒక విషయంలో మాత్రం క్లారిటీ ఉంది. కార్యకర్తలు, పార్టీకి సుదీర్ఘకాలంగా పనిచేసిన వారికి లోకేశ్ ప్రధమ ప్రాధాన్యత ఇస్తారు. టిక్కెట్ల కేటాయింపుల్లో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ, మరే ఇతర సమస్యల విషయంలోనైనా నారా లోకేశ్ ప్రాధాన్యత పార్టీకి నమ్మకంగా పనిచేసిన వారిపైనే ఉంటుంది. ఆయన ఈరోజు పనిగట్టుకుని నెల్లూరు జిల్లా పర్యటనను పెట్టుకున్నది కూడా అందులో భాగంగానే. నారా లోకేశ్ కు ఎమ్మెల్యేలు ఎంత ముఖ్యమో పార్టీ నేతలు, కార్యకర్తలు తనకు అంత ముఖ్యమన్న సంకేతాలను బలంగా పంపే ప్రయత్నం చేస్తున్నారు.
కార్యకర్తలకు భరోసాగా...
తెలుగుదేశం పార్టీ సిధ్దాంతాలు వదలి లైన్ దాటి,నిజాయితీ లీడర్స్,క్యాడర్ ని వేధింపులకు దిగిన వారిని నారా లోకేశ్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెడుతున్నారు.తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే ఎమ్మెల్యే ల పై కఠిన చర్యలు, సీరియస్ యాక్షన్ కు లోకేశ్ సిద్ధమయినట్లే కనిపిస్తుంది. కార్యకర్తలే ఫస్ట్ అనే లోకేష్ నినాదాన్ని నిజం చేస్తూ టిడిపి సీనియర్ లీడర్స్,కార్యకర్తలకు జరిగే అవమానాలు,నష్టం పై ఎప్పటికప్పుడు నారా లోకేశ్ అలెర్ట్ గానే ఉంటారు. పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని కార్యకర్తలు, నేతల కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో లోకేశ్ ముందుంటారు. తెలుగుదేశం పార్టీకి నలభై ఏళ్లుగా కాపు కాస్తున్న మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబానికి నేనున్నంటూ, అండగ నిలిచేందుకు,ధైర్యం చెప్పేందుకు దగదర్తి గ్రామానికి లోకేశ్ చేరుకున్నారు.
కావ్య కృష్ణారెడ్డిపై ఆగ్రహం...
ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేస్తే అవమానించి,వేధించిన తీరు పై కావలి ఎమ్మేల్ల్యే కృష్ణరెడ్డి పై నారా లోకేశ్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ,సీనియర్ టిడిపి లీడర్లు,కార్యకర్తల నుండి కావలి లో టిడిపి వాస్తవ పరిస్థితి పై నిఖార్సైన రిపోర్ట్స్ తెప్పించుకున్న లోకేశ్ యాక్షన్ లోకి దిగడంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి చెమటలు పడుతున్నాయి. మాలేపాటి కుటుంబంలో రెండు మరణాలతో టిడిపి కి జరిగిన నష్టం,మాలేపాటి కుటుంబంలో మహిళలకు జరిగిన అగౌరవం నేపథ్యంలో నారా లోకేశ్ నేరుగా వచ్చి వారిని పరామర్శించనున్నారు. ఎంత పెద్ద తోపు నేతలయినా,మంత్రులు,ఎంపి లు ,ఎమ్మేల్ల్యే లు అయినా నిజాయితీ లీడర్లు,కార్యకర్తలకు గౌరవం,మర్యాద ఇవ్వక పోతే పక్కన పెట్టేస్తామని స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు.
జస్ట్ విష్ చేసేందుకే అనుమతి...
టిడిపి సీనియర్ లీడర్లు,కార్యకర్తలు,మాలేపాటి కుటుంబం అభిప్రాయం మేరకు నారా లోకేశ్ కావలి పర్యటనలో ఎమ్మేల్ల్యే కృష్ణారెడ్డి కి రోడ్డు పై జస్ట్ విష్ చేసేందుకే అనుమతి ఇవ్వడంతో ఈ విషయం మరోమారు స్పష్టమయింది. కావ్య కృష్ణారెడ్డి కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా లోకేశ్ ఆగ్రహానికి కారణమని చెప్పాలి. తాను పార్టీ వల్ల గెలవలేదని, వందల కోట్లు ఖర్చు పెడితేనే గెలిచానని ఆయన చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబాన్ని వేధించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నారా లోకేశ్ కావలి పర్యటన తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేశ్ పర్యటనతో క్యాడర్ తిరిగి సాధారణ స్థితికి చేరుకోగలదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Next Story

