Mon Mar 16 2026 12:02:50 GMT+0530 (India Standard Time)
భువనేశ్వరి ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో శాసన సభలో అడుగుపెట్టడంపై ఆయన సతీమణి భువనేశ్వరి ట్వీట్ చేశారు

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో శాసన సభలో అడుగుపెట్టడంపై ఆయన సతీమణి భువనేశ్వరి ట్వీట్ చేశారు. ఈరోజు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ వీడియోను భువనేశ్వరి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నిజం గెలిచిందని, ప్రజాస్వామ్యం నిలిచింది..ప్రజలకు ప్రణామం అంటూ వ్యాఖ్యానించారు.
నాడు శపథం...
నాడులో చంద్రబాబు శపథం...నేడు అదే సభలో ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టడంపై భువనేశ్వరి ట్వీట్ చేశారు. భువనేశ్వరి చేసిన ట్వీట్ వైరల్ అయింది. నిజం గెలిచిందంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆమె పోస్టును రీట్వీట్ చేస్తున్నారు. నిజం గెలవాలి అంటూ ఆమె ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సంగతి తెలిసిందే.
Next Story

