Wed Jan 21 2026 04:11:47 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి స్పందించిన నారా భువనేశ్వరి
నపై చేసిన వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి మరోసారి స్పందించారు. భువనేశ్వరి తిరుపతిలో పర్యటిస్తున్నారు.

తనపై చేసిన వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి మరోసారి స్పందించారు. భువనేశ్వరి తిరుపతిలో పర్యటిస్తున్నారు. వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున సాయం అందిస్తున్నారు. వరదల్లో మృతి చెందిన ఒక్కరికి లక్ష రూపాయల చొప్పును భువనేశ్వరి స్వయంగా బాధిత కుటుంబాలకు అందజేస్తున్నారు.
ఏ మహిళ....
తనను అన్నట్లు ఏ మహిళను కించపర్చవద్దని నారా భువనేశ్వరి సూచించారు. ఇలాంటి రాజకీయాలు సమాజానికి మంచివి కావని ఆమె హితవు పలికారు. మహిళలను కించపర్చడం మంచిది కాదన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని నారా భువనేశ్వరి తెలిపారు. ఏ మహిళ తనలాగా బాధపడకూడదని ఆమె అన్నారు.
Next Story

