Thu Mar 26 2026 13:01:15 GMT+0530 (India Standard Time)
నన్ను కలవడానికి వస్తే తప్పేమిటి?
తనను కలిసేందుకు వస్తున్న పార్టీ నేతలను పోలీసులు బెదిరించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు.

తనను కలిసేందుకు వస్తున్న పార్టీ నేతలను పోలీసులు బెదిరించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఆమె ట్వీట్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా తనను రాజమండ్రిలో కలిసేందుకు వస్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. తనకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకే వారు సంఘీభావ యాత్ర చేపట్టారని ఆమె అభిప్రాయపడ్డారు.
నోటీసులు ఇస్తారా?
అందులో తప్పేముందని ఆమె పోలీసులను ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు తమకు బిడ్డల్లాంటి వారని, బాధల్లో ఉన్న ఒక అమ్మను కలవడం తప్పా? అందుకు చర్యలు తీసుకుంటారా? అని నారా భువనేశ్వరి నిలదీశారు. పోలీసులు ఎందుకు నోటీసులు ఇస్తున్నారని అన్నారు. ప్రజలు, మద్దతుదారులు తనను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడదని ఆమె ప్రశ్నించారు.
Next Story

