Thu Dec 18 2025 04:52:15 GMT+0000 (Coordinated Universal Time)
Nara Bhuvaneswari : కుప్పంలో నారా భువనేశ్వరి
నేడు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి రెండవరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు

నేడు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి రెండవరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా నారా భువనేశ్వరి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు రామకుప్పం, కుప్పం మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రామకుప్పం మండలం వీర్ణమాల తండా లో గిరిజన మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
లక్షకు పైగా మెజారిటీ...
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కుప్పం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెబుతూ తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడును లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఆమె చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తుండటంతో కుప్పం టీడీపీ నేతల్లో జోష్ నెలకొంది.
Next Story

