Thu Mar 19 2026 00:15:52 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి నారా భువనేశ్శరి పర్యటన
నేటి నుంచి నారా భువనేశ్శరి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు

నేటి నుంచి నారా భువనేశ్శరి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో పర్యటన చేస్తున్నారు. నిజం గెలవాలి అనే పేరుతో భువనేశ్వరి జిల్లాలను పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడును స్కిల్ డెవెలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో ఉంచిన తర్వాత అనేక మంది టీడీపీ కార్యకర్తలు గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.
పరామర్శకు...
ఈరోజు నారా భువనేశ్వరి రేపల్లె, ఒంగోలు, పర్చూరు నియోజకవర్గాల్లో పర్యటించి మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థిక సాయాన్ని అందచేయనున్నారు. రేపు దర్శి, కొండపి కందుకూరు నియోజకవర్గాల్లో పర్యటంచనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయగిరి, నెల్లూరు, ఫిబ్రవరి రెండో తేదీన వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం నాలుగు రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.
Next Story

