Fri Dec 05 2025 14:25:36 GMT+0000 (Coordinated Universal Time)
Nara Bhuvaneswari : నేటి నుంచి మూడురోజులు తూర్పుగోదావరి జిల్లాలో
ఈరోజు నుంచి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు

ఈరోజు నుంచి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఈరోజు జగ్గంపేట, పెద్దాపురం, తుని రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత...
చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు దానిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. రేపు పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఎల్లుండి అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
Next Story

