Sun Mar 08 2026 06:16:00 GMT+0530 (India Standard Time)
నందిగం సురేష్ కు చెస్ట్ పెయిన్.. గుంటూరు ఆసుపత్రికి తరలింపు
బాపట్ల మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ కు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బాపట్ల మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ కు గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నందిగం సురేష్ తనకు బీపీ, షోల్డర్ పెయిన్, చెస్ట్ పెయిన్ ఉన్నట్లు జైలు అధికారులకు తెలిపారు. దీంతో నందిగం సురేష్ జిల్లా జైలు నుంచి గవర్నమెంటు ఆసుపత్రికి తీసుకు వచ్చారు.
వైద్య పరీక్షల నిమిత్తం...
అక్కడ నందిగం సురేష్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు మరికొన్ని కేసులు కూడా ఆయనపై నమోదయిన నేపథ్యంలో ఆయన జైలులోనే ఉన్నారు.
Next Story

