Sun Feb 01 2026 14:20:15 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరుకు నందమూరి కుటుంబ సభ్యులు
బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి నందమూరి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు.

బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి నందమూరి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. ఇప్పటికే పురంద్రీశ్వరి, సుహాసినిలు చేరుకున్నారు. నారాయణ హృదయాలయలో నందమూరి తారకరత్న చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. 48 గంటల పాటు ఆయనను పరీక్షించాల్సి ఉంటుందని తెలిపారు.
కాసేపట్లో చంద్రబాబు...
ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, తారకరత్న భార్య నారాయణ హృదయాలయలోనే ఉన్నారు. తారకరత్న అందుతున్న చికిత్సపై ఎప్పటికప్పుడు వైద్యులు వారికి తెలియజేస్తున్నారు. మరికాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగుళూరుకు చేరుకోనున్నారు. నారాయణ హృదయాలయకు చేరుకుని తారకరత్నను పరామర్శించనున్నారు. వైద్యులతో చంద్రబాబు మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు దేవినేని ఉమ, చినరాజప్పలు అక్కడే ఉన్నారు.
Next Story

