Sat Mar 07 2026 22:28:13 GMT+0530 (India Standard Time)
ఎన్టీఆర్ పేరుపై నందమూరి కుటుంబం
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నందమూరి కుటుంబం స్వాగతిస్తుంది.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నందమూరి కుటుంబం స్వాగతిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మాజీ కేంద్రమంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రి పేరును జిల్లాకు పెట్టడాన్ని ఆమె అభినందించారు.
గర్వపడేలా....
తాజాగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కూడా ఎన్టీఆర్ పేరు పెట్టడంపై స్పందించారు. తమకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తమ తండ్రి పేరును జిల్లాకు పెట్టినందుకు జగన్ ప్రభుత్వానికి రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగువారు గర్వపడేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని ఆయన చెప్పారు.
Next Story

