Wed Dec 17 2025 08:50:10 GMT+0000 (Coordinated Universal Time)
Balakrishna : నేడు హిందూపురంలో బాలకృష్ణ
నేడు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు

నేడు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. మూడోసారి హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికయిన ఆయన తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వస్తున్నారు. వరసగా మూడుసార్లు గెలిపించిన హిందూపురంలో ఈఏడాది తన పుట్టిన రోజు వేడుకలను కూడా నందమూరి బాలకృష్ణ జరుపుకోనున్నారు.
పుట్టిన రోజు వేడుకలు...
టీడీపీ శ్రేణుల మధ్య బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. శ్రీసూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నందమూరి బాలకృష్ణ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. బాలకృష్ణ ఈ పర్యటనలో హిందూపురంలో అన్న క్యాంటీన్ను ప్రారంభించనున్నారు.
Next Story

