Sun Mar 08 2026 00:33:52 GMT+0530 (India Standard Time)
Nandabmuri : నేటి నుంచి బాలయ్య బస్సు యాత్ర
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు నందమూరి బాలకృష్ణ నేటి నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు నందమూరి బాలకృష్ణ నేటి నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. సర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఆయన రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి పర్యటించనున్నారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బాలయ్య పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాయలసీమలో...
ఉదయం 9 గంటలకు కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బస్సు యాత్రకు బయలుదేరుతారు. వివిధ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. బాలకృష్ణ కు రాయలసీమలో ఎక్కువ మంది అభిమానులున్న కారణంగా అక్కడి నుంచే ఆయన బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
Next Story

