Sun Mar 15 2026 19:07:28 GMT+0530 (India Standard Time)
తెలుగుజాతి ఉన్నంతవరకూ ఎన్టీఆర్ ఉంటారు
ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని నందమూరి బాలకృష్ణ తెలిపారు

ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాకుండా రాజకీయరంగంలో రాణించడానికి ఆయన ఆశయాలే కారణమని తెలిపారు. 26 ఏళ్లయినా ఆయన నేటికి కోట్లాది మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉన్నారని బాలకృష్ణ తెలిపారు.
అందరి గుండెల్లో నిండుగా....
తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఉంటారని బాలకృష్ణ తెలిపారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన ఆయన పేద ప్రజలకు ఎన్నో పథకాలను తెచ్చి ఆదుకున్నారని తెలిపారు. అందరి గుండెల్లో నిండుగా, మెండుగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలసి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.
Next Story

