Sat Dec 06 2025 04:07:29 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్స్
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసే ప్రసక్తి లేదని చెప్పారు.

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసే ప్రసక్తి లేదని చెప్పారు. జగన్ ను కలిసేందుకు వెళదామని తనను ఆహ్వానించినా తాను రాను అని చెప్పానని బాలకృష్ణ చెప్పారు. సినిమా రేట్లు తగ్గించినా అఖండ సినిమా మంచి కలెక్షన్లను సాధించిందన్న విషయాన్ని ఈయన గుర్తు చేశారు.
రెన్యుమరేషన్ పెంచను...
అయితే తాను సినిమా రెన్యుమరేషన్ ను పెంచబోనని బాలకృష్ణ తెలిపారు. ఇటీవల టాలీవుడ్ హీరోలు జగన్ ను కలసి సినిమా సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ ఈ భేటీకి దూరంగా ఉన్నారు. టిక్కెట్ల పెంపు, తగ్గింపుతో తనకు సమస్య లేదని బాలకృష్ణ చెప్పారు.
Next Story

