Thu Jan 16 2025 21:52:45 GMT+0000 (Coordinated Universal Time)
Nandamuri Balakrishna : బాలయ్యకు అంత అప్పు ఉందా?
నందమూరి బాలకృష్ణకు తొమ్మిది కోట్ల మేర అప్పులున్నాయట. ఈ మేరకు ఆయన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు
నందమూరి బాలకృష్ణకు తొమ్మిది కోట్ల మేర అప్పులున్నాయట. ఈ మేరకు ఆయన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ నిన్న నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో తన ఆస్తులు, అప్పుల వివరాలను బాలయ్య వెల్లడించారు. బాలకృష్ణ ఆస్తుల విలువ 81 కోట్ల రూపాయలు. ఆయన భార్య పేరిట రూ. 140 కోట్ల ఆస్తులున్నాయి. బాలకృష్ణ కుమారుడి పేరిట 58 కోట్లు ఆస్తులున్నట్లు నందమూరి బాలకృష్ణ తన ఎన్నికల అఫడవిట్ లో తెలిపారు.
9 కోట్ల అప్పులు...
అయితే నందమూరి బాలకృష్ణకు అప్పుడు కూడా ఉన్నాయి. ఆయనకు 9 కోట్లు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన భార్య వసుంధర అప్పులు రూ.3 కోట్ల 83 లక్షల 89 వేలుగా అఫడవిట్ లో చూపించారు. నందమూరి బాలకృష్ణ మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈసారి వైసీపీ నుంచి మహిళను ఎదుర్కొంటున్నారు. హిందూపురంలో ఇప్పటి వరకూ టీడీపీకి ఓటమి అనేది లేదు. మరి ఈ ఎన్నికల్లో బాలయ్య బాబు గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
Next Story