Thu Jan 22 2026 01:34:16 GMT+0000 (Coordinated Universal Time)
తారకరత్న కోసం బాలయ్య ఏం చేశారో తెలుసా?
నందమూరి బాలకృష్ణ ఇటీవల గుండెపోటుతో మరణించిన తారకరత్న పేరు మీద హిందూపురంలోని ఒక ఆసుపత్రిలో ఒక బ్లాక్ నిర్మించారు.

నందమూరి బాలకృష్ణ ఇటీవల గుండెపోటుతో మరణించిన తారకరత్న పేరు మీద హిందూపురంలోని ఒక ఆసుపత్రిలో ఒక బ్లాక్ నిర్మించారు. ఈ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారు. ఇందులో కార్డియాక్ పరీక్షలతో పాటు శస్త్రచికిత్సలు పేదలకి ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
తారకరత్న పేరు మీద...
తన ఇంట్లో వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని భావించిన బాలయ్య హిందూపురంలో తను నిర్మించిన హాస్పటల్ లో హెచ్ బ్లాక్ కి తారకరత్న పేరు పెట్టారు. 1.30 కోట్ల విలువ చేసే పరికరాలను తెప్పించారు. పేదలకు ఉచిత చికిత్సతో పాటు చిన్నపిల్లలకి ఉచిత భోజనం, కావాల్సిన మందులు కూడా 3 నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
Next Story

