Sun Mar 15 2026 13:42:29 GMT+0530 (India Standard Time)
TDP : హిందూపురంలో బాలయ్య నామినేషన్
హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ తన నామినేషన్ దాఖలు చేశారు

హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ తన నామినేషన్ దాఖలు చేశారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆయన హిందూపూర్ లో ప్రయత్నిస్తున్నారు. భారీ ర్యాలీతో బయలుదేరిన నందమూరి బాలకృష్ణ తొలుత సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించారు.
పూజలు చేసి...
ముందుగా హిందూపురంలోని తన ఇంటి నుంచి కార్యకర్తలతో కలిసి నందమూరి బాలకృష్ణ నామినేషన్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 12.10కు నామినేషన్ బాలకృష్ణ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి హిందూపురంలో టీడీపీ కార్యకర్తలతో పాటు బాలకృష్ణ అభిమానులు పెద్దయెత్తున తరలి వచ్చారు.
Next Story

