Fri Dec 05 2025 15:17:07 GMT+0000 (Coordinated Universal Time)
Nadamuri Bala Krishna : ఎల్లుండి నుంచి బాలయ్య బాబు జనంలోకి.. సీమలో తొడగొట్టేందుకు సిద్ధం
ఏప్రిల్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు

ఏప్రిల్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. దీనికి సైకిల్ రావాలి అని పేరు పెట్టారు. ఈ బస్సు యాత్ర ఏప్రిల్12న కదిరి , పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో జరగనుంది. ఏప్రిల్13న శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో, ఏప్రిల్14న బనగానపల్లె, ఆళ్లగడ్డ ,నంద్యాల నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. ఏప్రిల్15న పాణ్యం, నందికొట్కూరు, కర్నూలు , ఏప్రిల్16నకోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటించనున్నారు.
17వ వరకూ షెడ్యూల్...
ఈనెల 17న పత్తికొండ, ఆలూరు ,రాయదుర్గ్ ప్రాంతాల్లనూ పర్యటిస్తారు. ఇప్పటి వరకూ నందమూరి బాలకృష్ణ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేదు. దీంతో బాలయ్య అభిమానుల కోసం ఆయన ఎక్కువగా రాయలసీమలోనే పర్యటిస్తున్నారు, సీమలో బాలయ్య అభిమానులు ఎక్కువగా ఉండటంతో వాళ్ల ఓట్లను చేజిక్కించుకునే లక్ష్యంతో బాలయ్య యాత్ర సాగనుంది. ఈ యాత్రతో నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారంలో పాల్గొన్నట్లయింది. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.
Next Story

