Fri Dec 05 2025 12:24:13 GMT+0000 (Coordinated Universal Time)
భలే వేషంలో బాలయ్య
హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నేత ఇంట జరిగిన వివాహ వేడుకలకు బాలయ్య హాజరయ్యారు

నందమూరి బాలకృష్ణ కు కొంత కోపమున్నా, అభిమానులపై ఆగ్రహాన్ని అప్పుడప్పుడు వెళ్లగక్కినా ఆయనకున్నంత ప్రేమ ఎవరికీ ఉండదు. బాలయ్య బాబుకు తాను అనుకున్న వాళ్లను చేరదీస్తారు. మంచి మాటలతో పలుకరిస్తారు. తనకు తెలిసిన విషయాలను వారికి చెబుతారు. ఇవన్నీ బాలయ్యను దగ్గరుండి చూసిన వారు చెబుతున్నవి. నటుడిగానే కాకుండా బాలయ్య బాబు హిందూపురం ఎమ్మెల్యేగానూ కొనసాగుతున్నారు.
ఏ కార్యక్రమం జరిగినా....
తన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా బాలయ్య బాబు టక్కున అక్కడి వాలిపోతారు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో బెంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి హిందూపురం చేరుకుని కార్యకర్తలతో కొద్ది రోజుల పాటు గడుపుతారు. అయితే తాజాగా బాలయ్య బాబు హిందూపురం వచ్చి సందడి చేశారు.
వివాహ వేడుకకు....
హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నేత ఇంట జరిగిన వివాహ వేడుకలకు బాలయ్య హాజరయ్యారు. అందరిలాగే వస్తే ఏముందనుకున్నారో ఏమో బాలయ్య వేషం మార్చి వివాహానికి వచ్చారు. ఆ వివాహం ఒక ముస్లిం సోదరుడి ఇంట్లో జరుగుతుండటంతో ముస్లిం దుస్తులు ధరించి బాలయ్య వివాహానికి హాజరయ్యారు. బాలయ్య ఒక టీడీపీ కార్యకర్త ఇంట వివాహానికి హాజరు కావడంతో ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. వారిని నియంత్రించడం పోలీసులకు కష్టమయింది.
Next Story

