Sat Mar 14 2026 21:05:26 GMT+0530 (India Standard Time)
CM Jagan named a baby: చిన్నారికి సీఎం జగన్ ఏమని పేరు పెట్టారో తెలుసా?
అభిమానించే నాయకుల దగ్గరకు అప్పుడప్పుడు చంటి పిల్లలను ఎత్తుకుని

అభిమానించే నాయకుల దగ్గరకు అప్పుడప్పుడు చంటి పిల్లలను ఎత్తుకుని వస్తూ ఉంటారు కొందరు. అలాంటి సమయాల్లో తమ పిల్లలకు మీరే పేరు పెట్టండి అంటూ అడుగుతూ ఉంటారు. అలాంటి అనుభవాలు గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లకు ఎదురయ్యాయి. ఇక ఆయా నేతలు అధికారంలో ఉన్న సమయంలో కూడా పేర్లు పెట్టే అవకాశాలు వచ్చాయి. తమకు నచ్చిన వారి పేర్లో.. లేక దేవుడి పేర్లు పెట్టడం మనం చూసే ఉంటాం. తాజాగా ఏపీ సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ కు అలాంటి పరిస్థితి ఎదురైంది. ఆయన పెట్టిన పేరు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
సీఎం జగన్ భీమవరంలో పర్యటించిన సందర్భంగా చిట్టూరి సోనీ, చిట్టూరి మోహన్ కుమార్ తమ ఐదు నెలల బిడ్డను సీఎం జగన్ వద్దకు తీసుకుని వచ్చారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని సీఎంను కోరారు. ఆ దంపతులతో మాట్లాడిన సీఎం జగన్ వారి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడారు. "ఏం పేరు పెడదాం?" అంటూ కాసేపు ఆ చిన్నారిని లాలించి... "నాన్న పేరు పెడదాం" అంటూ 'రాజశేఖర్' అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
"చిన్నారికి నామకరణం చేసిన జగనన్న..
భీమవరంలో సీఎం వైయస్ జగన్ గారు ఓ చిన్నారికి నామకరణం చేశారు. చిట్టూరి సోనీ, చిట్టూరి మోహన్ కుమార్ దంపతులు తమ ఐదు నెలల బిడ్డని తీసుకుని జగనన్న వద్దకి వచ్చి పేరు పెట్టాలని కోరారు. దాంతో ఆ చిన్నారిని ప్రేమతో దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ ‘రాజశేఖర్’గా నామకరణం చేశారు." అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడియోను షేర్ చేసింది.
Next Story

