Sun Mar 15 2026 14:05:48 GMT+0530 (India Standard Time)
Breaking : నేడు బీజేపీలో చేరనున్న నల్లారి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరనున్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరనున్నారు. ఈరోజు 12 గంటలకు ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడతారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా...
అయితే ఏపీకి ఆయన సేవలను పరిమితం చేస్తారా? తెలంగాణలోనూ ఎన్నికల సమయంలో వినియోగించుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఆయన కేంద్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరుతుండటంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
Next Story

