Sun Dec 14 2025 11:36:18 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీలో చేరనున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి సీటును టీడీపీకి ఇచ్చేందుకు నిరాకరించడంతో పురంద్రీశ్వరి సూచనతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరనున్నారు.

నేడు బీజేపీ లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేరనున్నారు. అనపర్తి సీటును బీజేపీ టీడీపీకి ఇచ్చేందుకు నిరాకరించడంతో పురంద్రీశ్వరి సూచన మేరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరనున్నారు. తొలుత ఈ ప్రతిపాదన వచ్చినా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం తాను టీడీపీని వీడేందుకు ససేమిరా అన్నారు. చివరి నిమిషం వరకూ చంద్రబాబు అనపర్తిని టీడీపీ తీసుకోవాలని భావించింది.
ఎంతగానో ప్రయత్నించినా...
అనపర్తికి బదులుగా మరో నియోజకవర్గం ఇస్తామని చెప్పింది. పురంద్రీశ్వరి కూడా అనపర్తి నుంచి వచ్చే మెజారిటీ తన రాజమండ్రి పార్లమెంటు ఎన్నికలో గెలుపుపై ఆధారపడి ఉండటంతో ఆమె కూడా అనపర్తి సీటును టీడీపీకి ఇవ్వాలని సూచించినా అధినాయకత్వం అంగీకరించలేదు. దీంతో పురంద్రీశ్వరి సూచన మేరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేడు బీజేపీలో చేరనున్నారు. ఈనెల 23న అనపర్తి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.
Next Story

