Sat Mar 07 2026 19:35:33 GMT+0530 (India Standard Time)
యాదాద్రిలో రోజా... కేసీఆర్ సూపర్ అంటూ?
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని నగిరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని నగిరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని రోజా కితాబిచ్చారు. గతంలో తాను యాదాద్రికి వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ అసలు పోలికే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే వైభవంగా ఆలయ పునర్నిర్మాణ పనులను కేసీఆర్ పూర్తి చేశారని రోజా అభినందించారు.
గుంటూరు నుంచి ....
తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించేలా ఆలయ అభివృద్ధిని కేసీఆర్ చేశారని రోజా ప్రశంసించారు. యాదాద్రి ఆలయ నిర్మాణానికి వాడిన రాయిని గుంటూరు నుంచి తెప్పించారని రోజా చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములుగా, అక్కచెల్లెళ్లుగా కలసి ఉండాలని యాదాద్రి లక్ష్మీనరిసింహస్వామిని కోరుకున్నట్లు రోజా తెలిపారు.
Next Story

