Sat Apr 04 2026 01:33:24 GMT+0530 (India Standard Time)
జగన్ పుట్టిన రోజుకు రోజా ఏం చేశారంటే?
గరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాత్రం జగన్ పుట్టిన రోజుకు విన్నూత్న కార్యక్రమం చేపట్టారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అనేకమంది వైసీపీ నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాత్రం జగన్ పుట్టిన రోజుకు విన్నూత్న కార్యక్రమం చేపట్టారు. ఒక గ్రామాన్ని ఆమె జగన్ పుట్టిన రోజున దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
గ్రామాన్ని దత్తత తీసుకుని...
గత ఏడాది జగన్ పుట్టినరోజు సందర్భంగా రోజా ఒక పేద అమ్మాయిని దత్తత తీసుకుని చదవిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం నియోజకవర్గంలోని ముస్లింలు ఎక్కువగా ఉండే మీరాసాబ్ పాలెంను దత్తత తీసుకున్నారు. జగన్ వచ్చే పుట్టిన రోజు నాటికీ ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా మారుస్తానని రోజా తెలిపారు. గ్రామంలో అన్ని సౌకర్యాలను కల్పించి, అందరికీ విద్య అందేలా చర్యల తీసుకుంటామని తెలిపారు.
Next Story

