Sun Feb 01 2026 10:09:23 GMT+0000 (Coordinated Universal Time)
డాక్టర్ గా అవతారమెత్తిన రోజా
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డాక్టర్ కాదు. ఆమె యాక్టర్.అయినా డాక్టర్ కావాలనుకున్న తన కోరికను ఆర్కే రోజా నెరవేర్చుకున్నారు.

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డాక్టర్ కాదు. ఆమె యాక్టర్. రాజకీయ నేత. అయినా డాక్టర్ కావాలనుకున్న తన కోరికను ఆర్కే రోజా నెరవేర్చుకున్నారు. ఒక వైద్య శిబిరంలో ఆమె డాక్టర్ అవతారమెత్తారు. రోగులకు బీపీ పరీక్షలు చేశారు. మెడలో స్కెత్ స్కోప్ ధరించారు. కాసేపు డాక్టర్ గా ఆర్కే రోజా నటించారనే చెప్పాలి.
కల నెరవేరిందని....
ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో కేబీఆర్ పురంలో ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఆమె మెడలో స్కెత్ స్కోప్ ధరించి రోగులకు బీపీ చెక్ చేశారు. తాను డాక్టర్ కావాలన్నది చిన్ననాటి కల అని, మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా రాశానని, అయితే తాను యాక్టర్ ని అయ్యానని ఆర్కే రోజా నవ్వుతూ చెప్పారు.
Next Story

