Sun Mar 15 2026 02:57:49 GMT+0530 (India Standard Time)
అచ్చెన్నపై రోజా ఫైర్.. అప్పుుడే నా రాజీనామా
చంద్రబాబు, లోకేష్ తలకిందులుగా తపస్సు చేసినా ఈసారి ఎన్నికల్లో గెలవలేరని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు

చంద్రబాబు, లోకేష్ తలకిందులుగా తపస్సు చేసినా ఈసారి ఎన్నికల్లో గెలవలేరని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అచ్చెన్నాయుడు విసిరిన సవాల్ కు రోజా స్పందించారు. రోజా నగరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, అక్కడ టీడీపీ గెలవలేకపోతే వచ్చే ఎన్నికల్లో అక్కడ తాము పోటీ చేయబోమని ప్రకటించారు. దీనిపై ఆర్కే రోజా స్పందించారు. అచ్చెన్నాయుడు వచ్చి నగరి నియోజకవర్గానికి వచ్చి పోటీ చేసి గెలవాలని రోజా సవాల్ విసిరారు.
23 మంది రాజీనామా .....
తాను రాజీనామా చేయడం కాదని, 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి గెలవాలని, వారంతా గెలిస్తే తాను ఇక ఎన్నికలలో పోటీ చేయబోనని రోజా సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేష్ లు తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు గెలవడం జరగని పని అని రోజా ఫైర్ అయ్యారు.
Next Story

