Fri Dec 05 2025 11:14:06 GMT+0000 (Coordinated Universal Time)
Naga Babu : నాగబాబు కోపంగానే ఉన్నారా? అందుకేనా ఈ మౌనం
జనసేన ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు.

జనసేన ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. ఎక్స్ లోనూ పోస్టు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం తన అన్న చిరంజీవిపై అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలే కారణమని అంటున్నారు. సహజంగా నాగబాబు తన సోదరులు ఎవరిపైనా విమర్శలు వస్తే అసలు ఊరుకోరు. ఆయన వెంటనే కౌంటర్ ఇస్తారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఉండటంతో పాటు తాను పార్టీ ఎమ్మెల్సీగా ఉండటంతో నాగబాబు కొంత తనను తాను సంబాళించుకుని సంయమనంతో వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
గతంలో చేసిన విమర్శలు...
నిజానికి చిరంజీవి ఫ్యాన్స్ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా నాగబాబుకు తెలిసే జరిగిందంటారు. ఆయనను సంప్రదించిన తర్వాతనే చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మీటింగ్ వారు పెట్టుకున్నారని, అయితే తాను మాత్రం పెదవి విప్పకుండా కొంత సంయమనం పాటించారని చెబుతున్నారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన దానికి మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రకటన చేసి ఊరుకున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో నందమూరి బాల కృష్ణకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. దీనిని కూడా నాగబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ ఎవరూ ఖండించలేదు. అసలు ఆ విషయాన్ని ఇద్దరూ ఇంతవరకూ ప్రస్తావించలేదు. గతంలో బాలకృష్ణ పై నాగబాబు చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరంజీవితో జరిగిన భేటీలో...
పవన్ కల్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మౌనంగా ఉన్నారని భావించినా నాగబాబు సైలెంట్ గా ఉండటానికి మాత్రం కారణం రాజకీయ కారణమేనని అంటున్నారు. అయితే మౌనంగా ఉన్నప్పటికీ తన కోపాన్ని సన్నిహితుల వద్ద నాగబాబు ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. నాగబాబు విదేశాల నుంచి వచ్చిన చిరంజీవితో భేటీ అయిన సందర్భంలోనూ ఈ ప్రస్తావన రావడంతో చిరంజీవి కూడా ఆ విషయాన్ని వదిలేయాలని సూచించడంతో నాగబాబు మౌనంగా ఉన్నారని అంటున్నారు. అయితే తన అన్న చిరంజీవిపై చేసిన వ్యాఖ్యల నుంచి ఇంకా తేరుకోలేని నాగబాబు మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల విషయంలో మాత్రం పెద్దగా స్పందించడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Next Story

