Fri Dec 05 2025 19:07:08 GMT+0000 (Coordinated Universal Time)
Nagababu : నాగబాటు ట్వీట్ వైరల్.. వారిని టార్గెట్ చేస్తూ
నాగబాబు పరోక్షంగా టీడీపీకీ కౌంటర్ ఇచ్చారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని ఆయన చేసిన ట్వీట్ సీట్ల ప్రకటన పైనేనని అంటున్నారు

జనసేన నేత నాగబాబు పరోక్షంగా టీడీపీకీ కౌంటర్ ఇచ్చారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని ఆయన చేసిన ట్వీట్ సీట్ల ప్రకటన పైనేనని అంటున్నారు. కాదు కాదు వైసీపీ గురించి అని టీడీపీ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. ీటీడీపీ అధినేత చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా, నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించి టీడీపీకి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఎవరిని ఉద్దేశించి...
జనసేన రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. అయితే నాగబాబు మాత్రం చర్యకు ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ సిద్ధాంతాన్ని ఆయన ఉటంకించారు. అయితే ఈ ట్వీట్ టీడీపీని ఉద్దేశించి చేసిందేనని కొందరు.. కాదు వైసీపీని టార్గెట్ చేస్తూ అని మరికొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాగబాబు మాత్రం తాను చేసిన ట్వీట్ లో తాను పెట్టే ప్రతీ పోస్ట్ కి ఏదోక అర్ధం వుంటదని, అనుకోవద్దు కొన్ని సార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాని, ఈరోజు Physics laws చేసాను రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తానని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Next Story

