Thu Dec 18 2025 23:04:35 GMT+0000 (Coordinated Universal Time)
ఏం చేశారని జగన్ కు సన్మానం చేస్తారు?
ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ కు తెలుగు చిత్ర పరిశ్రమ సన్మానం చేయనుందన్న వార్తలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ కు తెలుగు చిత్ర పరిశ్రమ సన్మానం చేయనుందన్న వార్తలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. సీనీ పరిశ్రమకు చెందిన పెద్దల వైఖరిని ఆయన తప్పుపట్టారు. వారి వైఖరిని మార్చుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. మొన్నటి వరకూ పేదల కోసం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పెంచాల్సి వచ్చిందన్నారు.
రాత్రికి రాత్రే ధనవంతులయ్యారా?
రాత్రికి రాత్రే ప్రభుత్వం దృష్టిలో పేదలు ధనవంతులయ్యారా? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ తీరును చిత్ర పరిశ్రమ పెద్దలు తప్పపట్టాలన్నారు. పేదలకు అండగా నిలవాలని ఆయన కోరారు. జనసేన ఆవిర్భావ సభను వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పారు.
Next Story

